ప్రతి జిల్లా నియోజకవర్గంలోనూ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు : కురసాల కన్నబాబు
నేడు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల జరుగుతున్న సందర్బంగా నకిలీ విత్తనాలు, ఎరువులు అనే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులపై ఉక్కుపాదం మోపడం జరుగుతుంది అని తెలిపారు. రాష్ట్రంలో గుంటూరు కేంద్రంగా నకిలీ దందా కొనసాగుతుంది అని అన్నారు. ఇప్పటికే దీనిపై వ్యవసాయశాఖ చేసిన దాడుల్లో రూ. 5.46 కోట్ల విలువైన కల్తీ యూరియాను సీజ్ చేశాము అని మంత్రి తెలియచేయడం జరిగింది. ఇలా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారుపై పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యినట్లు తెలిపారు. ఇక ఇందులో 1455 నమూనాలను పరీక్షించగా 35 నమూనాలు నాసిరకంగా ఉన్నాయి అని గ్రహించడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలా నకిలీ విత్తనాలు అమ్ముతున్న సంబంధిత డీలర్లపై కూడా చర్యలు చేపట్టాము అని సభకు తెలియచేయడం జరిగింది.
ఇక నుంచి ప్రభుత్వ ల్యాబ్ లో నిర్ధారించిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకే అనుమతి ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ప్రభుత్వంతో ఆయా విక్రయ సంస్థలు ఎంఓయు ఒప్పదనం చేసుకోవాలి అని అన్నారు. అగ్రీ ఇన్ పుట్ షాప్ లను సచివాలయాల వద్దే ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ అగ్రిల్యాబ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియాచేయడం జరిగింది.
ఇక మరో వైపు రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో అన్నా క్యాంటీన్లు అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడడం జరిగింది. అన్నా క్యాంటీన్లను టీడీపీ కార్యకర్తల కోసమే వాళ్లకు అనుగుణంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే... అక్కడ క్యాంటీన్లు పెట్టడం జరిగింది అని అన్నారు. ఇక సబ్సిడీపై ఇచ్చే ఆహారం సామాన్యులకు, పేద ప్రజలకు ఇవ్వలేదు అని ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఈ క్యాంటీన్లను 15 జిల్లా ఆసుపత్రులు, 28 ఏరియా ఆసుపత్రులు, 11 టీచింగ్ ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేయాలి అని మేము అనుకుంటున్నాము అని తెలియచేయడం జరిగింది.